Friday, July 30, 2010

Beautiful Composition by Sita Rama Sastry

ప్రాణం ఎపుడు మొదలైందో  తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా??
ప్రణయం ఎవరి హృదయంలో ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా??
ప్రమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే??
అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం
సరిగమలెరుగని మధురిమ  ప్రేమంటే!!
దరిదాటి  ఉరకలు  వేసే  ఏ  నదికైనా  తెలిసిందా  తనలో  ఈ  ఒరవడి  పెంచిన  తొలి  చినుకేదంటే
సిరిపైరై  ఎగిరే  వరకు  చేనుకి  మాత్రం  తెలిసిందా  తనలో  కనిపించే  కళలకు తొలి  పిలుపెదంటే!!

No comments:

Post a Comment