నడి రాతిరి చంద్రుడ్ని చూడగానే కంటి రెప్ప వాలింది.
ఆలోచనలు గుండె లోతుల్లోకి జారాయి
చెరిగిపోని చెరపలేని నీ ముఖ చిత్రాన్ని అవి పలకరించాయి
కల్మషం లేని కళ్ళు, ఆప్యాయంగా పలకరించే చిరునవ్వు, బుగ్గ లోని సొట్ట చూసి మది పులకరించింది
ఆ మోము చుస్తున్న కొద్ది చూడాలి అనిపించింది
మదిని నెమలి పించం తో స్పృశించినట్టు సుతిమెత్తని అనుభూతి కలిగింది
అలారం మోగటంతో ఉలిక్కిపడి లేచాను
గుండె లోని సంతోషం కన్నీటి చుక్కై చెక్కిలి మీద జారింది
తియ్యటి అనుభూతిని కలిగించిన ఆ సౌందర్యానికి ఇవే నా కవితా కుసుమాలు..!!
Superb raa . . . manchi kavi kooda vunnadu neelo . . kummei. Byeeeee :-)
ReplyDelete